రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఐదు ఎకరాల లోపు వారికి ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు చెల్లించారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

అటు తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులకు షాక్ ఇచ్చే విషయం చెప్పారు. రూ.2 లక్షల కంటే పైన ఉన్న వారికి రుణమాఫీ చేయమని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం అంటూ అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. అయితే రెండు లక్షలపై ఉన్న వారు ఆ మొత్తాన్ని బ్యాంకులకు కడితే రూ.2లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించి.. ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంత్రి తుమ్మల ప్రకటనను నిరసిస్తూ వారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.