‘గేమ్ ఛేంజర్’ ఫంక్షన్‌..రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి !

-

‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫంక్షన్‌ లో విషాదం చోటు చేసుకుంది. ‘గేమ్ ఛేంజర్’ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా యాక్సిడెంట్ జరిగి.. ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సమీపంలో జరిగిన ఘటన లో ఇద్దరు యువకులు మృతి చెందారు. రాజమండ్రిలో శనివారం జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌ అనే ఇద్దరు యువకులు వెళ్లారు.

Accident while returning from ‘game changer’ function.. 2 killed

అయితే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌కు బలమైన గాయాలు అయ్యాయి. మణికంఠ అక్కడికక్కడే చనిపోగా.. చరణ్ కాకినాడ జీజీహెచ్ తీసుకొస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news