ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి… జగన్‌ కు అచ్చెన్నా బహిరంగ లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ సీఎం జగన్‌ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు అని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అంటూ నిలదీశారు. గుంటూరులో కలుషిత జలంతో ప్రబలుతున్న డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయి….లక్షలాదిమంది ఆస్పత్రి పాలవుతున్నా పట్టకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనంటూ విమర్శలు చేశారు.

atchannaidu

గుంటూరులో డయేరియాతో నలుగురు మృతి చెందారు.. ముగ్గురికి కలరా వ్యాధి సోకిందని మండిపడ్డారు.సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమన్నారు. అధికారంలో ఉండే ఈ నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించండని కోరారు. వెంటనే ప్రజలకు సురక్షిత నీరు అందించాలి….రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news