ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్. రేపటి నుంచి విజయనగరం జిల్లాలో అగ్నివీర్ ర్యాలీ జరుగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది విజయనగరం జిల్లా యంత్రాంగం. ఇక ఈ రోజు రాత్రికే అభ్యర్ధులు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పోలీసు శిక్షణా కళాశాల మైదానంలో అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ జరుగనుంది.
శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు మొత్తం 13 జిల్లాల నుంచీ సుమారు 10 వేల మంది వరకు హాజరవనున్నారు యువకులు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 2 వరకు దాదాపు 14 రోజులు పాటు కొనసాగనుంది ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఇక రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఇది వరకే అడ్మిట్ కార్డులు పంపించారు అధికారులు. రోజుకు వెయ్యి మంది వరకు అనుమతి ఇచ్చారు అధికారులు. దీంతో నిరుద్యోగులకు సిద్ధం అవుతున్నారు.