లోకేశ్‌ రెడీగా ఉండు.. త్వరలో జైలుకే – మంత్రి మేరుగు నాగార్జున

-

నారా లోకేశ్‌ రెడీగా ఉండు.. త్వరలో జైలుకే అంటూ హెచ్చరించారు మంత్రి మేరుగు నాగార్జున. త్వరలో నారా లోకేశ్‌ కూడా ముద్దాయి కాబోతున్నాడని.. అన్నీ కేసుల్లో చంద్రబాబే ముద్దాయన్నారు. చంద్రబాబు మీద మాకు కక్షలేదని.. చట్టం తన పని తాను చేసుకుంటు ముందుకు వెళుతుందని పేర్కొన్నారు మంత్రి మేరుగు నాగార్జున. అవినీతి చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు మంత్రి మేరుగు నాగార్జున.

చంద్రబాబు అరెస్ట్ తో తనయుడు లోకేష్ కంటే దత్తపుత్రుడి ఓవరాక్షన్ ఎక్కువైందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో కూడా అంత ఓవర్ యాక్షన్ చేయలేదన్నారు మంత్రి మేరుగు నాగార్జున. వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొని చంద్రబాబు డబ్బును ఖాతాలో వేసుకున్నాడని ఆరోపించారు మంత్రి మేరుగు నాగార్జున. లోకేష్ అవినీతి గురించి పవన్ ఆనాడే చెప్పాడన్నారు. ఆనాడు పవన్ కుటుంబాన్ని బూతులు తిట్టించి నేడు అన్న అంటున్నాడు….పవన్ ప్యాకేజ్ స్టార్ట్ అని మరో సారి రుజువు అయ్యిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి మేరుగు నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news