ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్స్ పరీక్ష ఇక నుంచి ఒకే పేపర్ గా జరుగుతుంది. సైన్స్ లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేరువేరు పేపర్లుగా కాకుండా ఒకే ప్రశ్న పత్రం తో నిర్వహించనున్నారు. ఈ రెండు సబ్జెక్టు ల ప్రశ్నలను రెండు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో ఇస్తారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అనుసరిస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి బ్లూప్రింట్లు, నమూనా ప్రశ్న పత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. బ్లూ ప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. కాగా, గతంలో టెన్త్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో 11 పేపర్లలో జరిగేవి. అంతర్గత మార్కులు 20 ఉండగా పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు.