తిరుమల భక్తులకు అలర్ట్…శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

-

 

తిరుమల భక్తులకు అలర్ఠ్.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 57,223 మంది భక్తులు..దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 18,015 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లుగా నమోదు అయింది.

There is no chance of quality of TTD Laddu going down said Potu staff

ఇక అటు తిరుమలలో ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే ఆ రోజున ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఆ రోజున ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం, 9 గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం ఉంటుంది. ఇక ఆ రోజున రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version