ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. స్కూల్ విద్యార్థులకు కావలసిన వస్తువులు అన్నీ ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 2025 – 2026 విద్యా సంవత్సరం నుంచి… సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రమండలి పథకం అమలు కోసం చంద్రబాబు నాయుడు సర్కార్…. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది.
ఈ పథకం అమలు కోసం 953 కోట్లు ఖర్చు అవుతుందట. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి చదివి 35 లక్షల మందికి కిట్లు ఇవ్వబోతుందన్నమాట. అయితే ప్రభుత్వం ఇచ్చే కిట్ లో స్కూల్ పుస్తకాలు, బెల్టు బూట్లు బ్యాగు డిక్షనరీ వర్క్ బుక్స్ మూడు జతల యూనిఫాంలు ఉంటాయని సమాచారం. దీంతోపాటు యూనిఫామ్ కుట్టు కూలి… ఒకటో తరగతి నుంచి 8వ తరగతి పిల్లల కోసం 120 రూపాయలు ఇవ్వనుంది. ఇక తొమ్మిది నుంచి 10వ తరగతి విద్యార్థులకు యూనిఫామ్ కుట్టు కూలి… 240 చొప్పున అందించనుంది.