హైకోర్టు అనుమతితో అమరావతి నుండి అరసవిల్లి వరకు పాదయాత్ర చేపడుతున్నారు అమరావతి రైతులు. సెప్టెంబర్ 12వ తేదీన వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఈ యాత్రనుు ప్రారంభించారు. అమరావతిపై అధికార పార్టీీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర నేడు కృష్ణాజిల్లా గుడివాడ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుడివాడలోని కీలక ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడలో పలు ఆంక్షలు అమలులో ఉన్నాయని కృష్ణాజిల్లాా ఎస్పీ జాషువా వెల్లడించారు. 600 మంది రైతులతో యాత్ర చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని.. రైతులు ఈ ఆదేశాలను తప్పక పాటించాలని సూచించారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తే రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు ఎస్పీ.