పోలీసులా లేక మీరు TDP కార్యకర్తలా అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైసిపి విజ్ఞప్తి చేస్తోంది. తాజాగా విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది వైసీపీ నాయకత్వం. సోషల్ మీడియా పోస్టింగులపై మాజీ మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ… శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం అసంతృప్తే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో సినిమా పోలీసింగ్ నడుస్తోందని చురకలు అంటించారు మాజీ మంత్రి అమర్నాథ్. రాష్ట్రంలో వైసిపి సోషల్ మీడియా కో అర్దినేటర్లను వేధింపులకు గురు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లా&ఆర్డర్ పూర్తిగా గాడితప్పింది…TDP కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా లేక TDP కార్యకర్తలు గా వ్యవహరిస్తున్నారా ….? అంటూ నిలదీశారు. కనీసం ఫిర్యాదు తీసుకుని ఎక్ నాలెడ్జ్ మెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధ పడటం లేదన్నారు మాజీ మంత్రి అమర్నాథ్.