సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు – అంబటి

-

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు? అని నిలదీశారు. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. సాగునీరు కోసం పదే పదే తెలంగాణ రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అని ఆగ్రహించారు. తెలంగాణ రాజకీయాలపై మాకు ఆసక్తి లేదు.. ఎవరు అధికారంలోకి వచ్చిన మాకు సంబంధం లేదన్నారు అంబటి రాంబాబు.

మా వాటాకు మించి ఒక్క నీటి చుక్క వాడుకోలేదు.. ఇది చాలా సున్నీతమైన అంశం, గొడవలు అవసరం లేదన్నారు. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేశారు.. గతంలో చంద్రబాబు సర్కార్ ఫెయిలైతే.. ఇప్పుడు జగన్ సర్కార్ సక్సెస్ అయిందని స్పష్టం చేశారు. ఈ వివాదం చంద్రబాబు టైమ్ లోనూ ఉంది.. సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధమన్నారు. మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలి.. పురంధేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు.. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు మంత్రి అంబటి.

Read more RELATED
Recommended to you

Latest news