నాగార్జునసాగర్ వివాదం.. ఏపీ పోలీసులపై కేసు నమోదు

-

నాగార్జున సాగర్‌ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏపీ, తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


ఏపీ వైపున ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాసేపట్లో తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్‌, నీటి పారుదల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితులు సమీక్షించనున్నారు.

ఈ క్రమంలో ఏపీ పోలీసులు, ఇరిగేషన్‌ అధికారులపై కేసు నమోదైంది. తెలంగాణ ​ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చారని.. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు సాగర్‌ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు నాలుగువేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news