చంద్రబాబు అసమర్థత వల్ల తెలంగాణ పోలీసులు.. ఏపీ భూభాగంలోకి వచ్చారు.. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, ఓడించాల్సిన అవసరం మాకు లేదన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతు ఇచ్చారా?.. చంద్రబాబుకు చెందిన కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు? అని నిలదీశారు. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. సాగునీరు కోసం పదే పదే తెలంగాణ రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అని ఆగ్రహించారు. తెలంగాణ రాజకీయాలపై మాకు ఆసక్తి లేదు.. ఎవరు అధికారంలోకి వచ్చిన మాకు సంబంధం లేదన్నారు అంబటి రాంబాబు.