బీజేపీ చెవిలో పవన్ కళ్యాణ్ క్యాలీ ఫ్లవర్ పెట్టాడు – అంబటి రాంబాబు

-

బీజేపీ చెవిలో పవన్ కళ్యాణ్ క్యాలీ ఫ్లవర్ పెట్టాడంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. వారాహి విజయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అని.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట అంటూ ఎద్దేవా చేశారు. కారావ్యాన్ లో కూర్చుని పవన్ కళ్యాణ్, నాగబాబు, మనోహర్ జనాల తరలింపుకు ఫోన్లు చేసుకున్నారని చురకలు అంటించారు. బీజేపీ చెవిలో పవన్ కళ్యాణ్ క్యాలీ ఫ్లవర్ పెట్టాడు,,, వ్యక్తిగత జీవితంలో కూడా అంతే అన్నారు.

ఒక పెళ్ళి చేసుకుని మరొక ఆమెతో బంధం నడిపావు… రాజకీయంలో కూడా అంతే అంటూ పవన్‌ కళ్యాణ్‌ పై ఫైర్‌ అయ్యారు. సైకిల్ కు తుప్పు పట్టింది, టైర్లు లేవు…పవన్ కళ్యాణ్ మొదటి గ్లాసు పగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉన్నది రెండో గ్లాసు… ఎన్నికలు కమిషన్ జనసేనకు మొన్న మళ్ళీ గ్లాసు గుర్తును కేటాయించిందని ఎద్దేవా చేశారు. 175 సీట్లలోనూ వైసీపీదే గెలుపు… పవన్, చంద్రబాబు ఇద్దరూ ఓడి పోనున్నారు ‌..ఇది ఖాయం అన్నారు. ఈ అవినీతి స్కాం ల డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయేమో చూసుకోండి… కాల్ షీట్ కు కోట్ల రూపాయలు తీసుకునే నటుడు పవన్ కళ్యాణ్… డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు ? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news