ఓట్ల కోసం NTR పేరును BRS వాడుకుంటుంది – రేవంత్‌ రెడ్డి

-

ఓట్ల కోసం NTR పేరును BRS వాడుకుంటుందని మంత్రి కేటీఆర్‌ కు రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు. NTR పేరు నా పేరు ఒకటే అని కేటీఆర్ అంటున్నాడు… నక్క కు …కుక్క కు ఉన్న తేడా …పోల్చుకొకు కేటీఆర్ అంటూ ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. NTR ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు ఆయన కుటుంబ సభ్యులు సచివాలయం రాలేదు… కానీ కెసిఆర్ కుటుంబ సభ్యుల దోచుకుంటున్నారని ఆగ్రహించారు.

మంత్రి కేటీఆర్ కే వసూలు చేయడం అలవాటు అని.. కర్ణాటక లో బిల్డింగ్ పర్మిషన్ కోసం వసూలు అన్నట్టు కేటీఆర్ చేసిన ఆరోపణల పై నేను అక్కడ విచారణకు ఒప్పిస్తానన్నారు. కేటీఆర్ అవినీతిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు నేను లేఖ రాస్తా ..విచారణకు కేటీఆర్ రెడీ అవుతాడా అని సవాల్‌ చేశారు. బిజెపి ,BRS ఒక్కటే…సోనియా గాంధీ కి పేరు వస్తుందన్న అసూయతోనే విభజన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news