పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియా లో నాపై ,నా కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్ పై నేనే వెళ్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాను. వైఎస్ జగన్ పై , నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి. వైఎస్ భారతి పై అనుచిత కామెంట్స్ చేస్తున్నారు. వీటి పై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా నాపై ,నా కుటుంబ సభ్యుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ప్రయోజనం లేదు.
ఈ దేశం లో నేరం జరిగిందని, ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయడం లేదు. Bnss సెక్షన్ 173 ప్రకారం ఫిర్యాదు వచ్చిన సమాచారం తెలిసిన , 14 రోజుల లోపు కేసు నమోదు చేయాలి. కానీ గత నెల 17 న ,నేను వెళ్లి ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేవు. ఆర్జీవీ, పోసానిలపై, ఎవరో ఫిర్యాదు చేశారని వెంటనే కేసులు, నమోదు చేశారు. పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. టీడీపీలో చోటా నాయకులు ఫిర్యాదులు చేసినా వెంటనే చర్యలు తీసుకున్నారు .మా ఫిర్యాదులు మాత్రం చెత్త బుట్టలో పడేస్తున్నారు అని అంబటి తెలిపారు.