ఈవీఎం ధ్వంసం వీడియోను నారా లోకేష్ ఎందుకు పోస్ట్ చేసాడు – అంబటి

-

ఈవీఎం ధ్వంసం వీడియోను నారా లోకేష్ ఎందుకు పోస్ట్ చేసాడు అని ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. కొన్నిచోట్ల వైయస్సార్సీపీ ఓటర్లపై టీడీపీ దాడులు చేసింది అని తెలిపారు.

దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తగిన విధంగా స్పందించలేదు. ఈవీఎం ధ్వంసం వీడియోని అధికారులో, ఈసీనో విడుదల చేయకుండా నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎలా పోస్ట్ చేయగలిగాడు అంటూ ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. మాచర్లలో ప్రజాబలంతో 4 సార్లు గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఒక్క ఈవీఎం ధ్వంసం ఘటనను చూపి ఎల్లోమీడియా ఆయనపై దుష్ప్రచారం చేస్తోంది. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే ఈసీ ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోని మాత్రమే ఎందుకు బయటపెట్టింది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news