ప్రభాస్ ‘బుజ్జి’ గ్రాండ్ ఎంట్రీ.. కల్కి నుంచి ఈ లేటెస్ట్ గ్లింప్స్ చూశారా?

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మరో భారీ బడ్జె‌ట్ చిత్రం కల్కీ 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రామోజీఫిల్మ్ సిటీ వేదికగా కల్కీ చిత్రంలో కీలకంగా నిలిచే బుజ్జి వాహనాన్ని ప్రభాస్ తన అభిమానుల కోసం పరిచయం చేశారు. ప్రభాస్ స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేస్తూ గ్రౌండ్లోకి తీసుకురావడంతో ఈ ఈవెంట్ అభిమానుల కేరింతలతో మారుమోగింది.

అనంతరం సినిమాలో బుజ్జితో కలిసి ప్రభాస్ చేసిన హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్ సీక్వెన్స్ గ్లింప్స్ను స్క్రీనింగ్ చేశారు. ఆ వీడియోలో “ఒక్కరోజు పాజిటివ్గా ఉండు బుజ్జి ప్లీజ్ అని చెబుతూ ప్రభాస్ చేసిన యాక్షన్ హంగామా మాములుగా లేదు. చివరికి “ఇక తిరిగి వెళ్లేది లేదు. లవ్ యూ బుజ్జి” అని ప్రభాస్ అనగా బుజ్జి పర్లేదులే అంటూనే గ్లింప్స్ను ముగించారు. మొత్తంగా ఒక్కో సీన్ హాలీవుడ్నే తలదన్నేలా సీన్స్తో చూపించారు గ్లింప్స్.

Read more RELATED
Recommended to you

Latest news