కూటమిలో ఉన్న నాయకులు అక్రమ అర్జన కోసం కుస్తీలు పడుతున్నారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇసుక, మద్యం వాటాల కోసం మెజారిటీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు అని పేర్కొన్నారు. ఇక అద్భుతమైన మద్యం పాలసీ తీసుకొచ్చాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులు లేని గ్రామాలు ఏమున్నాయో సీఎం చెప్పాలి. లాటరీల్లో షాపులు గెలుచుకున్న వాళ్లు ఎమ్మెల్యేలకు 30 నుండి నలబై లక్షలు కట్టాల్సి వచ్చింది అని అన్నారు.
అయితే కొన్ని బార్లపై ఎమ్మెల్యేల మనుషులు దాడులు చేశారు. ఇక రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడ అమలవుతుందో చెప్పాలి. ఉచిత ఇసుక రీచ్ లు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు.ఆ ఇసుక రీచ్ ల వద్ద తవ్వకాలు సాగిస్తున్న కాంట్రాక్టర్లు ఎవరు అని అడిగారు. అయితే ఇసుకలో దోపిడి పెరిగిపోయింది. చివరకు బూడిద కోసం కూడా కడపలో ఫైటింగ్ జరుగుతుంది అని అంబటి రాంబాబు ఆరోపించారు.