ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అన్నారు అంబటి రాంబాబు. సరస్వతి ఫ్యాక్టరీకి 1184 ఎకరాల భూములు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ప్రభుత్వం దగ్గర దానాధర్మంగా తీసుకోలేదు. వైయస్ మరణం తర్వాత ,కొంతమంది నాయకులు ఈ భూముల పై కోర్టు ల లో కేసులు వేశారు. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న భూముల్లోకి, మీరు ఏ హక్కుతో వెళ్లారు. ప్రైవేటు భూముల్లోకి వెళ్లి, డిప్యూటీ సీఎం అక్కడవారిని రెచ్చగొట్టారు. ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీ రాకపోవటానికి ,అక్కడ వారికి ఉపాధి కల్పించలేకపోవటానికి, టిడిపి కాంగ్రెస్ నాయకులే ప్రధాన కారణం.
ప్రజలను రెచ్చగొట్టి ,వైయస్ జగన్ ను తిట్టడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ పని చేశారు. రోజులు ఇప్పుడు ఒకలాగే ఉండవు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. మేము తప్పు చేయబట్టే, 11 సీట్లకు పరిమితమయ్యాం.. మీరు తప్పు చేస్తే ,మీరు అంతే అవుతారు అని హెచ్చరించారు. కక్షపూరితంగా పాలన చేసే ఈ ప్రభుత్వానికి ,అధికారంలో ఉండే అర్హత లేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యం జరుగుతుంటే, వాళ్లను పరామర్శించడానికి టైం దొరకదు గానీ, సరస్వతీ భూములు కు వెళ్లి ప్రజలను రెచ్చగొట్టడానికి సమయం దొరికిందా, ఇది ప్రతీకార పాలన కాదా అని ప్రశ్నించారు అంబటి.