టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 53 రోజులతర్వాత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవడంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఓ ఖైధీ జైలు నుండి బయటకు వస్తుంటే టిడిపి నాయకులు సంబరాలు జరుపుకోవడం దారుణమని అంబటి సెటైర్లు వేశారు.
చంద్రబాబుకు బెయిల్ మాత్రమే వచ్చింది.. ఇంతదానికే న్యాయం గెలించిది, ధర్మం గెలిచింది అంటూ పెద్దపెద్దమాటలు అనడం తగదన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని కోర్టు తేల్చిన తర్వాత విడుదలయితే అప్పుడు సంబరాలు జరుపుకుంటే బాగుండేదని మంత్రి అంబటి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నాడని కోర్టు నమ్మి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అంబటి తెలిపారు. కంటి వైద్యం చేయించుకుంటానంటే హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. ఇది కేవలం నాలుగు వారాల పాటేనని టిడిపి నాయకులు గుర్తించాలన్నారు. జైల్లో ఏసి అనుమతిస్తారు. కానీ కంటి వైద్యం చెయ్యలేరు కదా. అందువల్లే బెయిల్ ఇచ్చారని అంబటి తెలిపారు.