హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో వ్యక్తులు నిలబడతారు. పార్టీకీ ఒకరు.. నిలబడతారు. వ్యక్తుల వెనుక పార్టీ ఉంటది. ఆయా పార్టీల యొక్క చరిత్ర ఏంటి..? వాళ్ల వైఖరీపై, ఆ పార్టీ ఫిలాసఫీ ఏంది..? ఆ పార్టీ ఎవ్వరి కోసం పని చేస్తుందని చర్చ జరపాలి. దళిత బిడ్డలు యుగ యుగాలుగా వివక్షకు గురవుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడే కాంగ్రెస్ లీడర్లు ఈ ఆలోచనలు చేసి ఉంటే దళితులకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.
ఓటు అనేది మన తలరాతను నిర్ణయిస్తుంది. భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. దయచేసి దానిని దుర్వినియోగం చేయకూడదు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ నాయకులే అని చెప్పారు కేసీఆర్. నాగార్జున సాగర్ ను ఏళేశ్వరం వద్ద నిర్మించాల్సింది. కానీ దానిని కిందికి జరిపి కడుతుంటే నోరు మూసుకొని ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత తొమ్మిదేళ్లలో 18 సార్లు వాటర్ విడిచాం.