టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని సెప్టెంబర్ 09న నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టులో వాదోపవాదనలు నడిచాయి. తాజాగా చంద్రబాబుకు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కు కండిసనల్ బెయిల్ ఇచ్చారు. సానుభూతి కోసం బెయిల్ తెచ్చుకున్నారు.
చర్మవ్యాధులను ప్రాణాంతకం అన్నట్టు చూపే ప్రయత్నం చేశారు. నిజం ఎక్కడ గెలిచింది? స్కిల్ స్కామ్ జరగలేదా..? పెండ్యాల శ్రీనివాస్ పారిపోవడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు.చంద్రబాబుకు బెయిల్ రావడంతో సంబురాలు చేసుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలని సజ్జల పేర్కొన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం బెయిల్ మంజూరు చేశారు. వ్యవస్థను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటికీ ఎలా వచ్చారు. నువ్వు రోగీవా..? వీర యోధుడివా అని ప్రశ్నించారు. చంద్రబాబు కేసు మెరిట్ చర్చ జరిగిందా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పించుకోవడానికి వీలు లేదు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేశారు.