కేంద్రమంత్రి అమిత్ షా ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. చెన్నై నుంచి సాయంత్రం 5:50 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తిరిగి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.
కాగా, నిన్న తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఏపీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపి సర్కారు అత్యంత అవినీతిలో కూరుకు పోయిందన్నారు. మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కాం లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. ‘ఏ స్కామ్ లు ఉన్నాయి అన్నిటి చేస్తోంది. ఇది సిగ్గు చేటు….ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసిపి అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు చేశారు నడ్డా.