తెలంగాణ బిజెపి అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. ‘కమిట్మెంట్ తో పనిచేస్తూ పార్టీ కోసం కష్టపడతా. మీడియా కథనాలు పట్టించుకోను. అధ్యక్ష మార్పుపై చర్చ ప్రచారం మాత్రమే. అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించినా కట్టుబడి పని చేస్తా. ప్రచారాలను నమ్మి పని ఆపలేను. సిబిఐ, ఈడి విచారణతో బిజెపికి సంబంధం లేదు.
ఏ పార్టీలో ఉన్నా దొంగలకు శిక్ష తప్పదు’ అని స్పష్టం చేశారు. రాజకీయాలను శాసించేది ప్రజలు కానీ. నాయకుల గ్రూప్ కాదన్నారు బండి సంజయ్. తెలంగాణలో రెండు సార్లు బీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ప్రజలు అనుకున్నారు.. ఓటు వేశారు … రెండు సార్లు ఆ పార్టీ అవిరి అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలు బీజేపీ నే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారని పేర్కొ న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారు తప్ప… పక్క రాష్ట్రా లను చూసి కాదని తెలిపారు.