మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు

-

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయనపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని టీడీపీ పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్‌ మంగళగిరి పోలీసులకు శనివారం రోజున ఫిర్యాదు చేశారు.

వైసీపీ అధినేత జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి భూములు టీడీపీ నాయకుల పరం కాకుండా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో కలిసి ఆపానని పొన్నవోలు అంటున్నారని మండిపడ్డారు. తనకు రూ.150 కోట్లు ఎరగా చూపారని ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోపణలకు ఆధారాలు పొన్నవోలు బయటపెట్టాలని గంగాధర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news