ఏపీలో టీచర్ల బదిలీలపై ప్రకటన విడుదల అయింది. ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేసింది చంద్రబాబు కూటమి సర్కార్. ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లు, 5 ఏళ్ళు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేయనుంది సర్కార్. నాలుగు కేటగిరి లుగా ఉపాధ్యాయుల విభజన చేశారు.
ఈ నెల 7 లోగా ఆన్ లైన్ లో సలహాలు సూచనలు పంపాలని విద్యాశాఖ వెల్లడించింది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం అయ్యే లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయనుంది ప్రభుత్వం. టీచర్ల బదిలీల కు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో కూటమి సర్కార్ ఉంది. ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ చట్టం 2025 పేరుతో బిల్ తీసుకురానుంది.