ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
జనాభా తగ్గిపోతోందని… ప్రపంచం ముసలిదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలే భావితరానికి ఆస్తి అని చంద్రబాబు అన్నారు. అందుకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం అన్నారు చంద్రబాబు. 8 నెలలుగా పాలనలో బిజీ అవ్వడంతో మీతో సమావేశం కాలేకపోయానని వెల్లడించారు. కార్యకర్తలతో సమావేశం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఎన్ని పనులున్నా వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తలను కలవడం బాధ్యతగా పెట్టుకుంటానని ప్రకటించారు బాబు.