జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తాం- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

-

జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ…65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారన్నారు. జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తాం… గత ఎన్నికల సమయంలో పెన్షన్ ను రూ.3 వేలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత విడతల వారిగా ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహించారు. చంద్రబాబు మాత్రం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారు…రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారని వెల్లడించారు. అంతేగాక మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున ఇస్తాం… పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే ఇంటిటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తారు… ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. గతంలో రూ.2వేల 700.కోట్ల నిధులను పెన్షన్ ల కోసం వెచ్చిస్తుండగా..ఇప్పుడు రూ. 4 వేల 400.కోట్ల మేర పెన్షన్ లను ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news