‘కల్కీ 2898’ మూవీ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పెషల్ పోస్ట్..!

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులతో పాటు సినీప్రియులు విజువల్స్‌కు ఫిదా అవుతూ సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పైరసీని ప్రోత్సహించొద్దని కోరుతూ ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో భారీ ఓపెనింగ్స్‌ రాబడుతోంది. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ అందుకున్న సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పెట్టిన‌ ప్ర‌త్యేక పోస్ట్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను ఈ సినిమా కోసం చెప్పులు అరిగిపోయేలా ప‌ని  చేశానని సింబాలిక్‌గా చెబుతూ.. తన అరిగిపోయిన చెప్పులు ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు ఇది సుదీర్ఘ రహదారి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.  ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news