ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు టీమ్ తమ తమ శాఖల ప్రక్షాళనలో నిమగ్నమయ్యాయి. మరోవైపు కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు కూడా ముమ్మరం అయింది. మరోవైపు కొత్త సర్కార్ నేతృత్వంలో తొలి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రంగం సిద్ధం అవుతోంది.

ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ తొలి సమావేశం జరపాలని నిర్ణయించింది. 19వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు హింస, లాక్ అప్ డెత్, అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాత వైఖరి తదితర అంశాలపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయా ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం లేఖలు రాసింది.

Read more RELATED
Recommended to you

Latest news