ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులే టాప్

-

ఏపీ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. సెకండ్ ఇయర్లో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు ద్వితీయ స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో సంవత్సరం ఫలితాల్లోనూ 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు రెండో స్థానంలో , 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news