యూట్యూబ్‌లో కుకీస్‌ వీడియో చూసి వ్యాపారం ప్రారంభించేశాడు.. సీన్‌ కట్‌ చేస్తే లక్షల్లో ఆదాయం

-

వంట చేయడం అనేది అంత తేలికైన పని కాదు. వంట చేయడం రాని వాళ్లకు, బిగినర్స్‌కు అయితే ఇదో పెద్ద టాస్క్‌ అనిపిస్తుంది. పుస్తకాల్లో చదివి లేక అమ్మ సాయంతో చాలా మంది ఒకప్పుడు వంటలు నేర్చుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నారు. ఎలాంటి ఫుడ్‌ ఐటమ్‌ అయినా తేలిగ్గా యూట్యూబ్‌లో చూసి చేసేయొచ్చు. కాకపోతే అవి ఒక్కోసారి హిట్‌ అవుతాయి..ఒక్కోసారి ఫ్లాప్‌ అవుతాయి. కానీ ఇలాంటి యూట్యూబ్‌ వీడియోలో బిస్కెట్లు ఎలా చేయాలో చూసి ఏకంగా వ్యాపారం పెట్టేశాడు ఓ వ్యక్తి.. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.. మనం ఇంట్లో ట్రై చేయడానికే ఆలోచిస్తాం.. అలాంటిది అతను ఏకంగా అంగడే పెట్టేశాడు. పెట్టడమే కాదండి.. సక్సస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్నాడు కూడా..!

వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది సొంతంగా వ్యాపారం చేయాలని కలలు కంటారు. కానీ ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలపై సరైన సమాచారం లేదు. శతృఘ్న యాదవ్ విషయంలోనూ అదే జరిగింది. వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. ఏది నిర్ణయించాలో తెలియక తెగ ఆలోచించేవాడు. ఒక యూట్యూబ్ వీడియో చివరకు అతని దిశను మార్చింది.

బంకా జిల్లాలోని బాద్షాగంజ్ ప్రాంతానికి చెందిన శతృఘ్న యాదవ్ ఒక రోజు యూట్యూబ్ వీడియో చూస్తూ బిస్కెట్లు తయారు చేయడం చూశాడు. అది గ్రహించిన శతృఘ్న యాదవ్ బిస్కెట్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. శతృఘ్న యాదవ్ దాని కోసం చాలా కష్టపడి ఇప్పుడు మంచి లాభాలను పొందుతున్నాడు. బిస్కెట్ల తయారీ కర్మాగారానికి యాభై లక్షల రూపాయలు ఖర్చుచేశాడు. అందులో 28 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు.

బిస్కెట్లతో పాటు రస్క్, చపాతీ తదితర ఉత్పత్తులను కూడా తయారుచేస్తారు. చుట్టుపక్కల ప్రాంతంలో వారి ఉత్పత్తికి చాలా డిమాండ్ ఉంది. శత్రుఘ్న యాదవ్ తన బిస్కెట్ వ్యాపారం ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నాడు. రోజుకు లక్షకు పైగా బిస్కెట్లను తయారు చేస్తారు. ఒక బిస్కెట్ ప్యాకెట్‌లో పన్నెండు బిస్కెట్లు ఉంటాయి. శతృఘ్నకు అవి చేయడానికి ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతుందట.

Read more RELATED
Recommended to you

Latest news