ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆదేశాలతో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం, Sept 11 తేదీ నుండి రానున్న నూతన విధానంలపై సచివాలయం నుండి వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు.
గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమర్ ఇబ్రహింపట్నం కమీషనరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ రాష్ట్ర స్దాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలోనే జిల్లా స్దాయిలో కూడా జిల్లా స్దాయి కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని మీనా అదేశించారు. కలెక్టర్లు ఎటువంటి రాజకీయ వత్తిడులకు లోనుకావలసిన అవసరం లేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారని. పట్టా భూముల నుండి ఇసుక సేకరణకు త్వరలోనే జిఓ ఇవ్వనున్నామని, రవాణ చార్జీలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత ధర అమలులో ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు.