వలంటీర్లు సమ్మె చేయట్లేదని ఏపీ సర్కార్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వలంటీర్లు ఎక్కడ సమ్మె చేయడం లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. వామపక్ష సంఘాలు కొందరు వలంటీర్లను రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నాయని ఆరోపించారు.
వలంటీర్లంతా సీఎం జగన్ సైన్యం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, ఉద్యోగుల పెండింగ్ అంశాలను నెరవేర్చడంతో పాటు వలంటీర్ల జీతాలు పెంచుతారని పేర్కొన్నారు.
అటు ఏపీ వలంటీర్లకు షాక్. సమ్మెలో పాల్గొన్న వలంటీర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముగ్గురు వలంటీర్లపై వేటు పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ముగ్గురు వార్డు వలంటీర్లను విధులనుంచి తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తమకు రూ. 18 వేల జీతం ఇవ్వాలని, రెగ్యులర్ ఇవ్వాలని పలుచోట్ల వలంటీర్లు సమ్మె నోటీసులు ఇస్తున్నారు.