సీఎం చంద్రబాబుతో ఏపీకి చెందిన మాజీ సీఎం భేటీ.. మ్యాటరేంటంటే..?

-

వారిద్దరూ ఒకే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు.. ఒకరమో సీఎంగా పాలన చక్కదిద్దుతుంటే..మరొకరేమో కాంగ్రెస్ హయాంలో సీఎంగా పనిచేశారు.. 50 ఏళ్లకు పైగా వైరమున్న ఆ ఇద్దరు ఇప్పుడు బేటీ అయ్యారు.. కాదు..కాదు.. కానీ రాజకీయ పరిస్థితులు వారిని కలిపేలా చేశాయి. దీంతో.. ఆ ఇద్దరి భేటీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.. వారిలో ఒకరు సీఎం చంద్రబాబునాయుడుకాగా..మరొకరు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..

Kiran Kumar Reddy: అందుకే ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా: మాజీ సీఎం కిరణ్  కుమార్ రెడ్డి - 10TV Telugu Kiran Kumar Reddy says Thats why he stayed away  from politics all these years | Kiran

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజేపీలో ఉన్నారు.. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్దిగా రాజంపేట లోక్ సభ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.. చంద్రబాబునాయుడు కూడా ఆయన గెలుపుకోసం ప్రచారం చేశారు.. ఇది అప్పట్లో సంచలనంగా మారింది.. ఇద్దరూ బద్ద శత్రువులు అయినప్పటికీ.. పార్టీ గెలుపుకోసం పనిచేశారు.. ఇప్పుడు ఏకంగా చంద్రబాబునాయుడి నివాసానికివెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు..

కాంగ్రెస్ హయాంలో సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి. తర్వాత బిజేపీలో చేరారు.. ఇప్పుడు ఏపీ బిజేపీ ఛీప్ పదవిపై కన్నేశారు.. పురందేశ్వరీ స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం పీక్స్ కు చేరింది.. ఈ క్రమంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.. పురందేశ్వరీకి కేంద్రంలో మంచి పదవి ఇచ్చిన తర్వాత.. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బాధ్యతలు అప్పగించే యోచనలో కమలం పార్టీ ఉందనే టాక్ వినిపిస్తోంది..

Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి  కలిసొచ్చిందేంటి..? | Reason Behind Nallari Kiran Kumar Reddy Defeat In  Rajampet Parliament Nag

రాష్ట బాధ్యతలు కుదరకపోతే.. జాతీయస్థాయిలోనైనా పదవి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని కోరారట. కేంద్రంలో కీలక పార్టనర్ గా ఉన్న చంద్రబాబు మద్దతు కోసమే ఆయన్ని కలిశారనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది.. చాలా రాష్ట్రాలకు ఇంచార్జ్ గవర్నర్లు కొనసాగుతున్నారు. ఒకవేళ గవర్నర్ పదవి ఇచ్చినా తీసుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగా ఉన్నారట. అదీ కుదరకపోతే త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో తనకు ఓ బెర్త్ కావాలని ఆశపడుతున్నారట.. ఈ విషయాలను చర్చించేందుకు చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news