తిరుమలలో టీటీడీ ఈవోగా సుధీర్ఘ కాలం విధులు నిర్వహించిన మూడో వ్యక్తిగా అనిల్ కుమార్ సింఘాల్ రికార్డులకెక్కారు. గతంలో పియస్ రాజగోపాల్ రాజు 1974 నుంచి 78 వరకు పనిచేయగా పివిఆర్కే ప్రసాద్ 03-11-78 నుంచి 08.07.82 వరకు ఈవో గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 సంవత్సరాల విరామం అనంతరం సుధీర్ఘ కాలం ఈవోగా సింఘాల్ మాత్రమే బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక ఆయన హయాంలో టైం స్లాట్ విధానం, శ్రీ వాణి ట్రస్ట్, వెండి వాకిలి వద్ద తోపులాటలు నివారణ, ఆలయంలోని పురాతన కట్టడాలు భక్తులు విక్షించేలా ఏర్పాట్లు, దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మాణం వంటి సంస్కరణలను తీసుకు వచ్చారు. ఇక టీటీడీ ఈవోగా సుధీర్ఘ కాలం విధులలో కొనసాగిన అనిల్ కుమార్ సింఘాల్ ను వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా బదిలీ చేయడంతో ఇప్పుడు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ వి ధర్మారెడ్డికి ఈఓ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.