తిరుమల భక్తులకు అలర్ట్‌..పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలు మూసివేత

-

తిరుమల భక్తులకు అలర్ట్‌.. పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ పాలక మండలి మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. పొగ మంచుతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయం సమీపంలోని భక్తులతో పాటు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

Annihilation of sin, closing the paths of Lord’s feet

అలిపిరి మార్గంలో వెళ్లే వాహనదారులను తితిదే సిబ్బంది అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ 19న బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. 18న సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని వెల్లడించింది.కాగా, గడిచిన 24 గంట్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక ఈ తరుణంలోనే.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 71, 037 మంది భక్తులు దర్శించుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news