అయ్యప్ప స్వామిలకు కిషన్‌ రెడ్డి కీలక పిలుపు !

-

బాగ్ అంబర్‌ పేట్‌ లో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం నారాయణగూడలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నారాయణగూడ KMIT లో రేపు జరిగే అయ్యప్ప మహా పడిపూజకు స్వాములు, భక్తులు హాజరుకావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ జరుపుతున్నామని తెలిపారు.

Kishan Reddy’s key call to Ayyappa Swami

నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజ్లో జరిపే పడిపూజ కార్యక్రమానికి, అయ్యప్ప స్వామి భక్తులు, మాల వేసుకున్న స్వాములను ఆహ్వానించారు. స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ రోజు ఉదయం అంబర్పేట్ లోని అయ్యప్ప టెంపుల్ లో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ఈ సందర్భంగా ఆలయంలో గోమాతను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూజించి, అయ్యప్ప స్వామి భక్తులతో మాట్లాడారు వారిని రేపు జరిగే పూజకు హాజరుకావ్వాలని వారిని ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news