తూర్పుగోదావరి జిల్లా వాసులకు బిగ్ అలర్ట్. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మరో 15 రోజులు అవకాశం కల్పించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఓటు నమోదుకు గడువు పొడిగించారు ఎన్నికల అధికారులు. వాస్తవంగా.. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు నిన్నటితో ముగియాలి.

కానీ…ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కు మరో 15 రోజులు అవకాశం కల్పించారు. ఓటు నమోదుకు నిన్నటితో గడువు ముగియడం తో మరో 15 రోజులు పొడిగించింది ఎన్నికల కమిషన్. ఇక డిసెంబర్ 25 తేదీ వరకు తేదీన ఓట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 30వ తేదీన ఆఖరి ఓటర్లు జాబితా విడుదల చేస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మరో 15 రోజులు అవకాశం కల్పించడంతో…జనాలు తమ ఓటు కోసం అప్లై చేసుకుంటున్నారు.