ఏపీలో మరో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారి పై అత్యాచారం.. ఆపై హత్య..!

-

ఆంధ్రప్రదేశ్  లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. తొమ్మిదేళ్ల చిన్నారి.. ఆడుకుంటానని బయటకు వెళ్లింది.. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు తల్లిదండ్రులు. నాలుగు రోజులైంది.. జాడ తెలీలేదు. చివరికి ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేసారనే సమాచారంతో తల్లిదండ్రుల గుండెలు గుబేలుమన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది.

ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. ఎక్కడుందోనని వెతికారు, కనిపోయించలేదు. చీకటి పడింది.. అయినా జాడ దొరకపోవడంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రోజే ఎంపీ బైరెడ్డి శబరి విజయోత్సవ సభ నందికొట్కూరులో ఉండగా ఆమెకు బాలిక అదృశ్యంపై సమాచారం ఇచ్చారు. వెంటనే ఆచూకీ కనుక్కోవాలి పోలీసులను ఆదేశించింది. రెండు రోజులపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. మూడవ రోజు పోలీస్ జాగిలాలతో ముచ్చుమర్రిలో పరిశీలించారు. పోలీసు జాగిలం పార్కు వద్ద నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని ముచ్చుమర్రి లిఫ్ట్ అప్రోచ్ కెనాల్ వరకు వెళ్లింది. బాలిక ఆడుకున్న పార్కులో విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టయిల్ లో విచారించారు పోలీసులు. అందులో ఒకరు బాలిక వాసంతిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారు. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపు వారే.. ముచ్చుమర్రి కి చెందిన వారే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news