BREAKING: బెజవాడ వాసుల్లో టెన్షన్ టెన్షన్.. మళ్లీ విజయవాడ మహా నగరంలో మొదలైంది వర్షం. ఇప్పటికే వరదతో అల్లాడిపోతున్న విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. నిన్న అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా గత రెండు గంటలుగా సాధారణంగా వర్షం కురుస్తోంది. సింగ్ నగర్ వాంబే కాలనీ వైయస్సార్ కాలనీలో తగ్గింది వరద నీరు. ఆ కాలనీలో పూర్తిగా నీటిని తొలగించారు అధికారులు. మరి కొన్నిచోట్ల రెండు అడుగులు మేర వరద నీరు ఉంది. ఇక అటు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ముంపు ప్రాంతాలకు పాలు, ఆహార పదార్దాలు అందించే వాహనాలు సిద్ధమవుతున్నాయి.