ఈ టెక్నిక్ తో థైరాయిడ్ సమస్య నువ్వు ఎంతో సులువుగా సులభంగా గుర్తించవచ్చు

-

సహజంగా ఏదైనా సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించడం లేక చెకప్ చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే థైరాయిడ్ సమస్యను కూడా అదేవిధంగా చేయించుకుంటారు. కాకపోతే ఎప్పుడైతే థైరాయిడ్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఎంతో సులభంగా థైరాయిడ్ సమస్యను గుర్తించవచ్చు. థైరాయిడ్ ఉన్నవారిలో మెడ కింద భాగంలో కాలర్ బోన్ పైన సరైన విధంగా పరీక్షించాలి. ఇలా చేస్తే థైరాయిడ్ కు సంబంధించిన లోపాన్ని కనిపెట్టవచ్చు. థైరాయిడ్ గ్రంధిలో గ్రోత్ నోడ్యూల్స్, గోయిటర్స్ వంటివి ఏర్పడడం వలన థైరాయిడ్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పైగా దీని తీవ్రత ఎక్కువ అవ్వడం వలన క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ గ్రంధిలో మార్పులను గమనిస్తారో తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా మెడ పరిమాణంలో మార్పులు రావడం, వాపు వంటివి ఎదుర్కోవడం వీటి లక్షణాలు. ఒకవేళ మెడ భాగంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే పరీక్ష చేసుకోవచ్చు. కాకపోతే అన్ని సందర్భాలలో మెడలో గడ్డలు ఏర్పడడం థైరాయిడ్ కి సంకేతం కాదు. అయోడిన్ లోపం ఉన్న వారిలో కూడా ఇటువంటి లక్షణాలు కనబడతాయి. అయితే దీనిని కనిపెట్టడానికి ఈ ప్రక్రియను పాటించాలి.

అద్దం ముందు నిల్చుని ఎడమ చేతిని, కుడి చేతి వైపు మెడకు కదిలించాలి. ఇలా చేసిన తర్వాత వేళ్ళ సహాయంతో దవడా, కాలర్ బోన్ మధ్య భాగంలో నొక్కాలి. ఈ విధంగా చేసి వేళ్లను పక్కకు తిప్పి ముందు భాగంలో ఉన్న ఆడమ్స్ ఆపిల్ వైపుకు తీసుకురావాలి. దీని తర్వాత మళ్లీ ఇదే ప్రక్రియను చేసి చేతివేళ్ల సహాయంతో మెడ పక్కన దవడ దగ్గర నొక్కాలి. ఇలా చేస్తే మెడ ముందు భాగంలో తేలికగా ఉండడం లేక మెడలో ముద్ద వంటి భాగం కనిపించడం వంటివి జరుగుతాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. అంతేకాకుండా అద్దం ముందు నిల్చొని మంచినీరును తీసుకోండి. ఇలా తాగుతున్న సమయంలో నీటిని మింగుతున్నప్పుడు ఆడమ్స్ ఆపిల్ కింద ఏదైనా మార్పు కనిపిస్తే తప్పకుండా థైరాయిడ్ చెకప్ చేయించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news