వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ చైర్మన్

-

ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు వైసీపీ కి రాజీనామా చేసి అధికార టీడీపీలో కొందరూ చేరితే.. మరికొందరూ జనసేనలో చేరారు. ఇలా చాలా వరకు అధికారంలో ఉన్న కూటమిలోకి పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ రెడ్డి టీడీపీ లో చేరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకు ముందు సుధీర్ రెడ్డి వైసీపీకి, కౌన్సిలర్ పదవీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకు గాను వైసీపీ 19 వార్డుల్లో విజయం సాధించింది.టీడీపీ 6 చోట్ల మాత్రమే గెలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు విజయదుందుబి మోగించాడు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రాలేదు. అలా భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధించిందని పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version