నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది.

ఈ భేటీలో ఈసారి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నది నిర్ణయం తీసుకుంటుంది. ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తెలిసింది. గవర్నర్‌ ప్రసంగంపై మంగళవారం రోజున చర్చ జరగనుంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశ పెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్‌ విధానం, రాష్ట్ర అప్పులు-ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశముంది. మరోవైపు శాసనసభ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్‌లు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version