ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకు?.. స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు

-

ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ ఎక్స్‌ ఖాతాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తి సామర్థ్యాలను కించపరిచేలా ఆమె మాట్లాడారంటూ దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు ఎంపీలు, న్యాయవాదులు విమర్శించారు.

పూజా ఖేడ్కర్‌ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా నేపథ్యంలో.. ఆమె ‘ఎక్స్‌’లో తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘‘ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో.. దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నా’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘వైకల్యం అనేది శక్తి, మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ పోస్టు చూస్తోంటే వైవిధ్యం, జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తోంది’’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version