AP Assembly : ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే…పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్ ను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అనంతరం గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం పెట్టనున్నారు. ఈ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
అనంతరం ధన్యవాద తీర్మానం పై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం ఉంటుంది. దాదాపు 2 గంటల పాటు సీఎం జగన్ మాట్లాడతారు. ఇక సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024 ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.