ఏపీ రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. మే నెల నుంచి రైతులకు విడతల వారీగా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “ఉద్యోగాల్లో 33, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాం. మా సర్కార్ కు మొదటి ప్రాధాన్యత వెనకబడిన వర్గాల సంక్షేమమే. ఈ ఏడాది లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం. బీసీలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదే. పార్టీకి మొదట్నుంచీ వెన్నెముక బీసీ వర్గాలే. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తాం. మోదీ, పవన్, నేను కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పని చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇల్లు కట్టుకునే వెనుకబడిన వర్గాలకు అదనంగా రూ.50 వేలు ఇస్తాం.” అని చంద్రబాబు ప్రకటించారు.