ముఖ్యమంత్రిగా నాలుగోసారి నేడు చంద్రబాబు ప్రమాణస్వీకారం

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ఈరోజు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్‌ తదితరులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎంగా చంద్రబాబు నాలుగోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు.. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో తొలిసారి ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా.. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ఉండి.. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా నేడు ప్రమాణం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news