నేడు ఏపీలో అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం

-

పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు స్ఫూర్తిని కొనసాగిస్తూ గతంలో తెలుగుదేశం హయాంలో ఆంధ్ర ప్రదేశ్ లో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని మూసివేసినా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పునఃప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తొలిదశలో 100 అన్న క్యాంటీన్లు పేదలకు అంకితం చేయాలని ముఖ్యంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు.

మరోవైపు  రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కేవలం 5 రూపాయలకే అందించనున్నారు. క్యాంటీన్ ఆవరణలోనూ ఫ్యాన్లు, టీవీ, శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో పనుల కోసం పల్లెల నుంచి వచ్చే కూలీలకు అన్నక్యాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version